Share News

Weather Updates: నేడు అక్కడక్కడ భారీ వర్షాలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:34 AM

రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Weather Updates: నేడు అక్కడక్కడ భారీ వర్షాలు
Rain Alert

రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది, సోమవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 10:54 AM