Jaganmohan Rao: హెచ్‌సీఏ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:56 AM
అవినీతి ఆరోపణలపై అరెస్టయిన హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్,
కార్యదర్శి, కోశాధికారిపైనా చర్యలు
అవినీతి ఆరోపణలపై అరెస్టయిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి సీజే శ్రీనివాసరావుపై వేటు పడింది. ఈ ముగ్గురినీ కార్యవర్గం నుంచి సస్పెండ్ చేస్తూ జూలై 28న జరిగిన సంఘం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం, అత్యున్నత ప్రమాణాలకు హెచ్‌సీఏ కట్టుబడి ఉంది. సంఘం విశ్వసనీయతను కాపాడటం, సంఘం విస్తృత ప్రయోజనాల రీత్యా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిపై చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొంది. మోసం, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగానికి సంబంధించి వారిపై సీఐడీ, ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హెచ్‌సీఏ నిబంధనలు 41 (6), రూల్ 51(4) (డి) ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News