Share News

Jaganmohan Rao: హెచ్‌సీఏ అధ్యక్షుడి అరెస్టు

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:25 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ ఆసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) వివాదానికి సంబంధించి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

Jaganmohan Rao: హెచ్‌సీఏ అధ్యక్షుడి అరెస్టు

  • ముగ్గురు ఆఫీసు బేరర్లు కూడా.. క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకలు

  • సన్‌ రైజర్స్‌ వివాదంపై సీఐడీ చర్యలు

హైదరాబాద్‌, జూలై9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ ఆసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) వివాదానికి సంబంధించి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆఫీసు బేరర్లలో హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్‌, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ యాదవ్‌తో పాటు రాజేందర్‌ భార్య జి. కవితను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీని టికెట్ల కోసం బెదిరించి, భయపెట్టిన ఘటనకు సంబంధించి విజిలెన్స్‌ విభాగం ఇటీవలే ఓ నివేదికను ప్రభుత్వానికి అందచేసింది.


సన్‌ రైజర్స్‌ను కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం బెదిరించారని, వీఐపీ బాక్స్‌కు తాళం వేశారంటూ జగన్మోహన్‌రావు బృందంపై ఆరోపణలొచ్చాయి. ఇవన్నీ వాస్తవమేనని విజిలెన్స్‌ విచారణలో వెల్లడైంది. ప్రభుత్వం నుంచి విజిలెన్స్‌ నివేదిక సీఐడీకి అందడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. జగన్మోహన్‌రావుతోపాటు పాటు హెచ్‌సీఏ బాధ్యులందరికి ఈ వివాదంతో సంబంధం ఉండటం, ఆర్థిక అవకతవకలు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సీఐడీ అధికారులు సేకరించారని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 03:25 AM