Share News

మెట్రో కారిడార్‌-6 పనులపై జవాబివ్వండి: హైకోర్టు

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:53 AM

ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న మెట్రో కారిడార్‌-6 పనులు ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, మెట్రోరైల్‌ ఎం.డి. తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

మెట్రో కారిడార్‌-6 పనులపై జవాబివ్వండి: హైకోర్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న మెట్రో కారిడార్‌-6 పనులు ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, మెట్రోరైల్‌ ఎం.డి. తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. యాక్ట్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ (ఏపీడబ్ల్యూఎఫ్‌) సంస్థ అధ్యక్షుడు మహమ్మద్‌ రహీమ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. వారసత్వ కట్టడాలపై ప్రభావం ఎంత ఉంటుందో తెలిపేలా హెరిటేజ్‌ ఇంపాక్ట్‌ అసె్‌సమెంట్‌ జరగనుందున పనులు ఆపాలని కోరారు.


ఈపిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజాయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది మూడువారాల సమయం కోరడంతో విచారణ ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Feb 28 , 2025 | 04:53 AM