రాజ్యాంగ సంరక్షణ ప్రతి పౌరుని బాధ్యత
ABN , Publish Date - Jan 27 , 2025 | 04:08 AM
ఆదివారం హైకోర్టు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర ఉత్సవాల్లో జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించడం ద్వారా తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.
లోక్ అదాలత్ వినియోగంలో దేశంలోనే ఫస్ట్
గణతంత్ర వేడుకల్లో జస్టిస్ సుజాయ్‌పాల్ వెల్లడి
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాయ్‌పాల్ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ నేషనల్ ఆర్మీ అధికారులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఎలాంటి కాగితం ముక్కను చూడకుండానే రెండురోజులపాటు వాదనలు వినిపించిన స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది భూలాబాయి సేవలను గుర్తుచేస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆదివారం హైకోర్టు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర ఉత్సవాల్లో జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.
జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించడం ద్వారా తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ప్రసంగించారు.