Share News

Harish Rao: బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:18 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ అమలు చేయాలని, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Harish Rao: బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి

  • స్థానిక ఎన్నికల్లో 42ు రిజర్వేషన్‌ అమలు చేయాలి: హరీశ్‌

  • సన్నవడ్లకు బోనస్‌ విడుదల చేయాలని సీఎంకు లేఖ

సిద్దిపేట టౌన్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ అమలు చేయాలని, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట పట్టణంలో పలు కార్యక్రమాలకు హాజరైన అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెడితే, రేవంత్‌రెడ్డి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. భూమికి సంబంధించిన పని కావాలంటే మంత్రులకు 30ుకమీషన్‌ ఇవ్వాల్సిందేనని, వారిది భూమాత కాదు.. భూమేత అయ్యింద న్నారు. మంత్రులు, ఎమ్మెల్యేకు కమీషన్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.


రైతు కందులు పండిస్తే 3క్వింటాల్లే కొంటున్నారని, కంది రైతుల మీద కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకం తపగ అని నిలదీశారు. కొత్త పాస్‌బుక్‌ వచ్చిన వాళ్లకు రైతుభరోసా పడడంలేదన్నారు. సన్నవడ్లకు బోనస్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని.. 48గంటల్లో ఇస్తామని 48 రోజులైనా బోనస్‌ డబ్బులు రైతాంగానికి ఇవ్వలేదని హరీశ్‌ మండిపడ్డారు. సన్నవడ్లకు రూ.432కోట్లు ప్రభు త్వం బకాయిఉందని, వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. సర్కారు నిర్లక్ష్య వైఖరితో రైతులు, నేతన్నలు, ఆటోడ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్టీ రంగానికీ చేరడం దురదృష్టకరమని ‘ఎక్స్‌’ వేదికగా హరీశ్‌రావు పేర్కొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 04:18 AM