Share News

Harish Rao: ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు జరపడం లేదు

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:38 AM

ఓడిపోతామనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంలేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. దమ్ముంటే 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ ఆయన సవాల్‌ విసిరారు.

Harish Rao: ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు జరపడం లేదు

  • దమ్ముంటే 40 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి: హరీశ్‌రావు

సిద్దిపేట క్రైం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఓడిపోతామనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంలేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. దమ్ముంటే 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ ఆయన సవాల్‌ విసిరారు. మళ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండల యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్‌ పాటిల్‌ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. సిద్దిపేట క్యాంప్‌ కార్యాలయంలో హరీశ్‌రావు ఆయనకు బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జూటా మాటలలో సీఎం రేవంత్‌ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు పోటీ అని అన్నారు. ఎకరాకు రూ.15వేల రైతుబంధు ఇస్తానని రూ.12వేలు ఇచ్చినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బహిరంగ చర్చకు పోదామని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అంటున్నారని, ఎక్కడికి రమ్మన్నా తాను సిద్ధమని హరీశ్‌ రావు అన్నారు.


ప్రభుత్వం రైతులను మోసం చేసింది: వేముల

వరదను తట్టుకోవచ్చు కానీ రేవంత్‌ రెడ్డి నోటి నుంచి వచ్చే అబద్ధాల బురదను భరించడం కష్టమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఏం సాధించి రైతు సంబరాలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో రైతులందరికి రుణమాఫీ జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ఏపీకి గోదావరి నీళ్లు పంపుతున్న సీఎం.. కరీంనగర్‌ పట్టణానికి నాలుగు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎంకు ఏ బేసిన్‌ ఎక్కడుందో తెలియదని ఎద్దేవా చేశా రు. బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించాలని డి మాండ్‌ చేశారు. మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. నెలరోజుల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు.


హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: బీజేపీ

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభా్‌ష చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. కోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లను కచ్చితంగా అమలుచేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 26 , 2025 | 04:38 AM