Inter Exams: ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:53 AM
మార్చిలో జరగనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విడుదల చేశారు.
విద్యార్థులు తమ కాలేజీల నుంచి పొందవచ్చు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మార్చిలో జరగనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విడుదల చేశారు. విద్యార్థులందరి హాల్ టికెట్లను కళాశాలల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశామని, విద్యార్థులు తమ కాలేజీల నుంచి పొందవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో విద్యార్థులకు వ్యక్తిగతంగానూ పంపిస్తామన్నారు. హాల్ టికెట్లలో ఏమైనా తేడాలుంటే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని సూచించారు.