Hyderabad: పెరుగుతున్న నెట్‌మీటర్లు.. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు ఆసక్తి
ABN , Publish Date - Jun 25 , 2025 | 08:05 AM
గ్రేటర్‌లో సౌరవిద్యుత్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెద్దసంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్న గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తు భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో సౌరవిద్యుత్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెద్దసంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్న గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తు భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్(Metro, Ranga Reddy, Medchal) జోన్ల పరిధిలోని 10 సర్కిళ్లలో గత ఆరు నెలల్లో 2,042 నెట్‌మీటర్లను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసింది. గ్రేటర్ పరిధిలో మొత్తం 9 వేలకు పైగా నెట్‌మీటర్లు ఉండగా, హబ్సిగూడ సర్కిల్‌లో అత్యధికంగా 1756, సరూర్‌నగర్ సర్కిల్‌లో 1490 నెట్‌మీటర్లు ఉన్నాయి.
ఒక్కసారి పెట్టుబడితో 20 ఏళ్ల వరకు ఇంటికి సరిపడా విద్యుత్ వినియోగంతో పాటు, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించి ఆదాయం పొందే అవకాశాలు ఉండడంపై దీనికి ఆదరణ పెరుగుతోంది. ఏర్పాటు చేసుకుంటున్న వారిలో 80శాతం 3-5 కిలో వాట్ల సామర్థ్యం తో రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
నెట్‌మీటర్ల ఏర్పాటు ఇలా..
గృహాలు, భవనాల పై భాగంలో సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేసి అక్కడ నుంచి నెట్‌మీటర్‌కు కనెక్షన్ ఇస్తారు. సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్తత్తి అయిన విద్యుత్‌ను ఇళ్లలో వాడుకున్న తర్వాత మిగిలినది (యూనిట్ల రూపంలో) నెట్‌మీటర్‌తో గ్రిడ్‌కు పంపిస్తారు.
గ్రిడ్‌కు పంపించిన యూనిట్ల లెక్క నెట్‌మీటర్‌లో నమోదవుతోంది. గృహాల్లో వినియోగించిన యూనిట్ల కంటే సౌర విద్యుత్ అధికంగా ఉత్పత్తి అయితే 6 నెలలకు ఒకసారి విద్యుత్ బిల్లుల్లో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు ఒక ఇంట్లో 400 యూనిట్ల విద్యుత్ వాడుకుంటే అందులో 2000 యూనిట్లు సోలార్ రూఫ్‌టాప్ ద్వారా ఉత్పత్తి అయితే మరో 200 యూనిట్లకే కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. 4-5 ఏళ్ళలో సోలార్ రూఫ్‌టా్‌పకు పెట్టిన పెట్టుబడి మొత్తం విద్యుత్ బిల్లుల రూపంలో వసూలయితే మరో 15 ఏళ్లపాటు వచ్చేది అదనపు ఆదాయమని సోలార్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు
Read Latest Telangana News and National News