LRS Scheme: ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు నెల పొడిగింపు
ABN , Publish Date - May 04 , 2025 | 03:48 AM
ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీని మరో నెల రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు
ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం రూ.1,900 కోట్లు
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీని మరో నెల రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నుంచి అమల్లో ఉన్న రాయితీ పథకాన్ని ఇప్పటికే ప్రభుత్వం రెండు సార్లు పొడిగించింది.
సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించాల్సిన దరఖాస్తుదారులు ఉండడం, వారిలో ఇప్పటి వరకు 6 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించేందుకు ముందుకు రావడంతో పురపాలక శాఖ అధికారులు గడువు పెంచాలని మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో శనివారంతో ముగిసిన గడువును నెలాఖరు వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారిలో 40 శాతం మందికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి సుమారు రూ.1900 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..