Share News

GHMC: బకాయిలు ఇవ్వకపోతే పనులు నిలిపివేస్తాం

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:15 AM

అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ బూత్‌లలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది.

GHMC: బకాయిలు ఇవ్వకపోతే పనులు నిలిపివేస్తాం

  • జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల సంఘం హెచ్చరిక

  • హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో ఎన్నికల పనులకు సంబంధించిన బిల్లులు రూ.27.5 కోట్లు

  • వెంటనే ఇవ్వాలని డిమాండ్‌

పంజాగుట్ట, ఫిబ్రవరి10 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ బూత్‌లలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది. బిల్లులు ఇవ్వకపోవడంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు వెంటనే బకాయిలు చెల్లించాలని, లేకపోతే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే చేపట్టిన, త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులను నిలిపివేస్తామని సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.


గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల పనుల కోసం టెండర్లు పిలిచారాని, హైదరాబాద్‌ జిల్లా పరిఽధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి పనులు పూర్తయి.. ఈవీఎంలు గోడౌన్‌లో భద్రపరిచే వరకు 272 మంది కాంట్రాక్టర్లు పలు పనులు నిర్వహించారని పేర్కొన్నారు. ఒక్క మలక్‌పేట పరిధిలో బిల్లులు మాత్రమే చెల్లించారని, మిగతా 14 నియోజకవర్గాల పరిధికి సంబంధించిన సుమారు రూ. 27.50 కోట్లు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉందని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని, ఫలితం లేకపోవడంతో పూర్తి వివరాలతో రాష్ట్రపతికి లేఖ రాశమని తెలిపారు. ఏడు పని దినాల్లోపు న్యాయం చేస్తామని రాష్ట్రపతి భవన్‌ నుంచి తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. వారి సూచనల మేరకు ఎన్నికల అధికారులను కలిశామని అయినా కూడా బిల్లు రాలేదని వివరించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 04:15 AM