Medchal: మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:07 AM
మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
మేడ్చల్ టౌన్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సమయంలో ఇంటి ముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడికి శకలాలు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల పేలుడు జరిగిందా, లేక గ్యాస్ లీకేజీ వల్ల జరిగిందా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడి వివరాలు కూడా తెలియరాలేదు.
భార్యపై కోపంతో... రెండేళ్ల బిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి
నర్సాపూర్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): భార్యపై ఆగ్రహంతో.. మద్యం మత్తులో ఉన్న ఓ కసాయి తండ్రి తన రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని తుజాల్‌పూర్‌కు చెందిన ప్రశాంత్, ఇందు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో గొడవల కారణంగా ఇందు అచ్చంపేటలో తన పుట్టింటిలో ఉంటోంది. ఆదివారం సాయంత్రం భార్య వద్దకు వచ్చిన ప్రశాంత్ ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెను కొట్టేందుకు ప్రయత్నించగా, భయంతో పెద్ద కుమార్తెను తీసుకుని పక్కింట్లోకి వెళ్లింది. దీంతో ఇంట్లో ఉన్న చిన్న కుమార్తెను ఎత్తుకుని కోపంతో నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన పాపను ఇరుగుపొరుగు వారు హుటాహుటిన నర్సాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు, చిన్నారిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News