Share News

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో 60 పడకలతో కొవిడ్‌ సెంటర్‌

ABN , Publish Date - May 25 , 2025 | 04:30 AM

కొవిడ్‌ కలకలం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాంధీ ఆస్పత్రిలో 60 పడకలతో కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేశారు.

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో 60 పడకలతో కొవిడ్‌ సెంటర్‌

అడ్డగుట్ట, మే 24 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కలకలం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాంధీ ఆస్పత్రిలో 60 పడకలతో కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మూడు వార్డులను ఆస్పత్రిలో వివిధ చోట్ల ఏర్పాటు చేయగా ఓ వార్డును అత్యవసర విభాగంలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను పర్యవేక్షించేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజకుమారి సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ప్రస్తుతం ఎలాంటి కొవిడ్‌ కేసులు రాకపోయినప్పటికీ ముందుజాగ్రత్తలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని సూపరింటెండెంట్‌ తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో 24గంటలపాటు డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు.


పోలవరం డెడ్‌ స్టోరేజీ నుంచి ఎత్తిపోతల వద్దు

  • గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తరలించడానికి వీలుగా ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని తెలంగాణ కోరింది. తెలంగాణలో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నా నీటి లభ్యత లేదని ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నదని, ఈ ఎత్తిపోతలతో గోదావరి డెల్టా సిస్టమ్‌ (జీడీఎస్‌) అవసరాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ మేరకు పీపీఏ, గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) చైౖర్మన్‌లకు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌ కుమార్‌ శనివారం లేఖ రాశారు.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 04:30 AM