Share News

Full Water In Projects: భారీ వర్షాలు.. కళకళలాడుతోన్న ప్రాజెక్టులు

ABN , Publish Date - Aug 19 , 2025 | 09:42 AM

భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. దీంతో ఆ నీటి ని కిందకు విడదల చేశారు.

Full Water In Projects: భారీ వర్షాలు.. కళకళలాడుతోన్న ప్రాజెక్టులు

హైదరాబాద్, ఆగస్ట్ 19: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని దాదాపుగా అన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలాంటి వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని ఉన్నతాధికారులు కిందకు విడుదల చేస్తున్నారు. ఆ క్రమంలో మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు 35 గేట్లను ఎత్తివేసి.. లక్షా 83 వేల క్యూసెక్కుల నీటిని.. అలాగే నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేసి.. 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక వనపర్తి జిల్లా మదనా పురం సమీపంలోని కాజ్ వే బ్రిడ్జిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వరుసగా ఏడో రోజు కొత్తకోట, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.


ఇక జూరాల ప్రాజెక్ట్ వద్ద..

ప్రస్తుత నీటిమట్టం: 317.370 మీ.

ప్రస్తుత నీటి నిల్వ: 7.498 టీఎంసీల

పూర్తిస్థాయి: 318.516 మీ

9.657 టీఎంసీలు

ఇన్ ఫ్లో: 2,05,000 క్యూసెక్లు..

ఔట్ ఫ్లో: 2,32,687 క్యూసెక్లుగా ఉంది.


మహబూబ్ నగర్ జిల్లా.. దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటు తగ్గింది. ఈ ప్రాజెక్ట్‌లోని ఒక గేట్ ఎత్తివేశారు.

ఇన్ ప్లో :. 750 క్యూసెక్కులు

ఔట్ ప్లో :. 750 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం: 32 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 31 అడుగులు

ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 2. 270 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ : 2.2 టీఎంసీలు


నల్లగొండ: మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.

ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 10,279 క్యూసెక్కులుగా ఉంది.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం: 645 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 642.79 అడుగులు.

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం: 4.46 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం: 3.89 టీఎంసీలు


సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. 14 గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు నీటి విడుదల చేశారు.

ఇన్ ఫ్లో: 3, 83, 802 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 4, 18, 092 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటి మట్టం: 175 అడుగులు.

ప్రస్తుత నీటి మట్టం: 167.485 అడుగులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం: 45.77 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం : 38.89 టీఎంసీలు


సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.

ఇన్ ఫ్లో: 39,009 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 43,466 క్యూసెక్కులు

ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలుగా ఉంది.

ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ.. 19.534 టీఎంసీలు


నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద పోటెత్తింది. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

ఇన్ ఫ్లో: 3,70,309 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 3,98,660 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం: 590 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం: 585.20 అడుగులు

ప్రస్తుత సామర్థ్యం : 298.012 టీఎంసీలు

పూర్తి స్థాయి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు


వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకర సముద్రం రిజర్వాయర్..

ఇన్ ఫ్లో: 3,000 క్యూసెక్కులుగా ఉంది. ఐదు గేట్లు ఎత్తి.. 3,120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.


నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్:

ఇన్ ఫ్లో: 1500 క్యూసెక్కులు. దీంతో మూడు గేట్లు ఎత్తి.. 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు.


నిజామాబాద్‌ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటు కొనసాగుతుంది.

ఇన్ ఫ్లో 85 వేల క్యూసెక్కులు.. 13 గేట్లు ఎత్తివేత

ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు

ప్రస్తుతం 1403.33 అడుగులు

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టిఎంసి లు

ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 15.443 టీఎంసీల నీరు ఉంది.

ఇవి కూడా చదవండి:

వీడని మిస్టరీ.. జల్లెడ పడుతున్న పోలీసులు

భూకంపం.. భయంతో జనం పరుగులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 19 , 2025 | 09:46 AM