Free Training: బీసీ స్టడీ సర్కిల్‌లో ‘ఆర్‌ఆర్‌బీ’ ఉచిత శిక్షణ
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:44 AM
రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎ్‌ససీ, బ్యాకింగ్ నియామకాల కోసం అర్హత గల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎ్‌ససీ, బ్యాకింగ్ నియామకాల కోసం అర్హత గల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్హత గల అభ్యర్థులు ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్‌లైన్‌లో (www.tgbcstudycircle.cag.gov.in) దరఖాస్తులు పంపుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి వంద రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఎంపిక చేయనున్నట్లు వివరించారు.