Share News

Srinivas Goud: జీవో 93ని రద్దు చేయాలి

ABN , Publish Date - Aug 26 , 2025 | 09:39 AM

గౌడ కులస్థులకు వ్యతిరేకంగా ఉన్న జీవో 93ను రద్దు చేయాలని, మూతపడిన కల్లు దుకాణాలను వెంటనే తెరిపించాలని మాజీమంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కల్లుగీత సమన్వయ సంఘాల కమిటీ ఆధ్వర్యంలో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Srinivas Goud: జీవో 93ని రద్దు చేయాలి

- కల్లు దుకాణాలను తెరిపించాలి

- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌

హైదరాబాద్: గౌడ కులస్థులకు వ్యతిరేకంగా ఉన్న జీవో 93ను రద్దు చేయాలని, మూతపడిన కల్లు దుకాణాలను వెంటనే తెరిపించాలని మాజీమంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌(Former Minister V. Srinivas Goud) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కల్లుగీత సమన్వయ సంఘాల కమిటీ ఆధ్వర్యంలో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సగౌడ్‌, గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్‌, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్నగౌడ్‌లు జీవో 93 ప్రతులను చింపివేసి నిరసన వ్యక్తం చేశారు.


city3.2.jpg

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కల్లుగీత సొసైటీలకు వైన్స్‌, బార్ల కేటాయింపులో 25శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, వాటికి యాబై శాతం సబ్సిడీ ఇచ్చి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న పేరును పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పల్లె రవికుమార్‌, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణగౌడ్‌, బీసీ సంఘాల నాయకులు ఎస్‌.దుర్గయ్యగౌడ్‌, చీకటి ప్రభాకర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 26 , 2025 | 09:39 AM