Telangana: అది కేసీఆర్ ప్రభుత్వ విజయమే: హరీష్ రావు
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:46 PM
Brijesh kumar Tribunal: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు.. ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ విజయమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మొదటి నుంచి సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని కేసీఆర్ పట్టుబట్టారని పేర్కొన్నారు.

హైదరాబాద్, జనవరి 16: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు.. ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ విజయమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మొదటి నుంచి సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని కేసీఆర్ పట్టుబట్టారని పేర్కొన్నారు. తాజాగా ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని హరీష్ రావు తన ప్రకటనలో తెలిపారు. దీన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. అసలు ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్ 89 తెచ్చిందే కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ అని గుర్తు చేశారు హరీష్ రావు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని విమర్శించారు. ఆ తప్పిదాన్ని సరిదిద్దేందుకు బీఆర్ఎస్‌కు పదేళ్ల కాలం పట్టిందన్నారు. కృష్ణా నదిలో న్యాయమైన వాటా దక్కే వరకు బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు.
అసలేమైందంటే..
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కీలక ఉత్తర్వులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2023లో అంతర్రాష్ట జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌పై మొదట రెండు రాష్ట్రాల వాదనలు వినాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది. దీనిపై వాదనలు పూర్తయిన తరువాత ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని ట్రిబ్యునల్ ధర్మాసనం పేర్కొంది. తదుపరి వాదనలను ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగనున్నాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఎవరి వాటా ఎంత అన్నదానిపై వాదనలు విన్న తర్వాతే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని ట్రిబ్యునల్ చేపట్టనుంది.
Also Read:
కోహ్లీ వాచ్ కలెక్షన్ చూస్తే షాక్.. ఓ వాచ్ ధరతో ఇల్లు కొనేయొచ్చు
విమానాల్లో కొబ్బరి చిప్పలపై నిషేధం.. ఎందుకో తెలుసా!
For More Telangana News and Telugu News..