Share News

Love Affair: బండరాయితో కొట్టి చంపి.. ముక్కలు చేసి కాల్చి లారీ డ్రైవర్‌ దారుణ హత్య

ABN , Publish Date - Feb 17 , 2025 | 01:43 AM

పథకం ప్రకారం తన కూతురితో ఫోన్‌ చేయించి అతడిని ఓ చోటుకి పిలిపించి బండరాయితో కొట్టి చంపేశాడు. ఆపై. మృతదేహాన్ని ముక్కలు చేసి పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు.

Love Affair: బండరాయితో కొట్టి చంపి.. ముక్కలు చేసి కాల్చి లారీ డ్రైవర్‌ దారుణ హత్య

వివాహితుడైనా.. ఓ మైనర్‌ బాలికతో ప్రేమ

కుమార్తెతో పిలిపించి హత్య చేసిన తండ్రి

సంగారెడ్డి జిల్లాలో ఘటన

నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): పెళ్లై ఇద్దరు పిల్లలకు తండ్రైన ఓ లారీ డ్రైవర్‌ .. ప్రేమంటూ ఓ బాలిక చుట్టూ తిరుగుతుండగా ఆమె తండ్రి సహించకలేకపోయాడు. పథకం ప్రకారం తన కూతురితో ఫోన్‌ చేయించి అతడిని ఓ చోటుకి పిలిపించి బండరాయితో కొట్టి చంపేశాడు. ఆపై. మృతదేహాన్ని ముక్కలు చేసి పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. ఆ ముక్కలు పూర్తిగా కాలకపోవడంతో వాటిని సమీపంలోని గుట్టల్లో విసిరేసి రెండ్రోజుల తర్వాత వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అంగోతు దశరథ్‌(26) అనే లారీ డ్రైవర్‌ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం నాగ్‌ధర్‌ పరిధిలోని రాంచందర్‌ తండాకు చెందిన ఆంగోతు దశరథ్‌.. సంగారెడ్డి సమీపంలోని ఓ చక్కెర పరిశ్రమలో లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. దశరథ్‌ భార్య సోనీ ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి కాగా ఆ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.


దశరథ్‌ గతంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసిన సమయంలో నిజాంపేట మండలం మేగ్యానాయక్‌ తండాకు చెందిన నేనావత్‌ గోపాల్‌ కూతురు(14)తో పరిచయం పెంచుకున్నాడు.ప్రేమ పేరుతో రెండేళ్లుగా ఆ బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీనిని సహించలేకపోయిన గోపాల్‌.. ఫిబ్రవరి 12న తన కుమార్తెతో దశరథ్‌కు ఫోన్‌ చేయించి పిలిపించాడు. ఆ సమయంలో సంగారెడ్డిలోని చక్కెర పరిశ్రమలో ఉన్న దశరథ్‌.. ఇంటికి వెళుతున్నానని చెప్పి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే, మేగ్యానాయక్‌ తండా శివారు ఈదుల్‌తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో దశరథ్‌ను గోపాల్‌ హతమార్చాడు. అలాగే, దశరథ్‌ ద్విచక్రవాహనాన్ని కూడా కాల్చేశాడు. అనంతరం గోపాల్‌ తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై రాంచందర్‌ తండాకు వెళ్లి ఓ మేకను కొనుగోలు చేసినట్టు తెలిసింది.


అయి తే, దశరథ్‌ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య సోనీ ఈ నెల 14న సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం 15న గోపాల్‌ చేసిన నేరాన్ని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈదుల్‌ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం గాలించిన పోలీసులు దశరథ్‌ మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దశరథ్‌ కుటుంబానికి అప్పగించారు.


Also Read:

గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..

భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..

For More National News and Telugu News..

Updated Date - Feb 17 , 2025 | 01:43 AM