Farmer: విద్యుదాఘాతంతో రైతు మృతి...
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:02 AM
పొలంలో పంటకు నీరు పారించేందుకు బోరు మోటారును ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు చనిపోయాడు.
మెదక్ జిల్లా శాలిపేటలో ఘటన
చిన్నశంకరంపేట, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పొలంలో పంటకు నీరు పారించేందుకు బోరు మోటారును ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు నర్ర రమేష్ (47) కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల సాగు చేసిన పంటకు నీరు పెట్టేందుకు ఆదివారం ఉదయం పొలానికి వెళ్లాడు. అక్కడ బోరు బావి వద్ద మోటర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు.