Share News

Hayathnagar: ఉరేసుకొని భార్య.. భవనంపై నుంచి దూకి భర్త

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:15 AM

ఆ దంపతుల క్షణికావేశం, వారి 11నెలల బిడ్డను అనాథను చేసింది. కుటుంబ తగాదాలతో మనస్తాపం చెందిన ఆ ఇల్లాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటే.. తీవ్ర షాక్‌కు గురైన ఆ భర్త, భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచాడు.

Hayathnagar: ఉరేసుకొని భార్య.. భవనంపై నుంచి దూకి భర్త

  • 24 గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

  • అనాథ అయిన 11నెలల బాబు.. హయత్‌నగర్‌లో ఘటన

హయత్‌నగర్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఆ దంపతుల క్షణికావేశం, వారి 11నెలల బిడ్డను అనాథను చేసింది. కుటుంబ తగాదాలతో మనస్తాపం చెందిన ఆ ఇల్లాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటే.. తీవ్ర షాక్‌కు గురైన ఆ భర్త, భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచాడు. హయత్‌నగర్‌ పరిధిలోని జరిగిందీ విషాదం. హయత్‌నగర్‌ డివిజన్‌ ముదిరాజ్‌ కాలనీకి చెందిన సంపంగి నగేశ్‌ (25) జీహెచ్‌ఎంసీలో కార్మికుడు. రెండేళ్ల క్రితం అదే కాలనీలో నివాసం ఉండే శిరీష (22)ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 11నెలల బాబు ఉన్నాడు. కొన్నాళ్లుగా నగేశ్‌, శిరీష మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం శిరీష ఇంట్లో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.


నగేశ్‌ వేధింపులను తాళలేకే శిరీష ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగేశ్‌ను అదేరోజు పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసి.. సాయంత్రం సొంతపూచీకత్తుపై విడిచిపెట్టారు. కాగా నగేశ్‌, బుధవారం తెల్లవారుజామున ముదిరాజ్‌ కాలనీ నుంచి నడుచుకుంటూ వచ్చి హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ సమీపంలోని రిలయన్స్‌ డిజిటల్‌ మార్ట్‌ భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. నగేశ్‌ మృతిపై అతడి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి నగేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 05:15 AM