Hyderabad: దొంగ సభ్యత్వాలతో గెలిచేందుకు కుట్ర..
ABN , Publish Date - Sep 27 , 2025 | 07:59 AM
దొంగ సభ్యత్వాలతో తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్‌లో ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు పన్నుతున్న కుట్రలను అడ్డుకుని ఈనెల 28న జరుగనున్న ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ సినిమా వేదిక సభ్యులు కోరారు.
- సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు వాయిదా వేయాలి
- తెలంగాణ సినిమా వేదిక సభ్యులు
హైదరాబాద్: దొంగ సభ్యత్వాలతో తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్(Telugu Cine Digital Artist Union)లో ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు పన్నుతున్న కుట్రలను అడ్డుకుని ఈనెల 28న జరుగనున్న ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ సినిమా వేదిక సభ్యులు కోరారు. ఈ మేరకు సినిమా వేదిక సభ్యులు పలువురు శుక్రవారం రాష్ట్ర కార్మికశాఖ అదనపు కమిషనర్ డా. ఇ. గంగాధర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలుగు సినిమా వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సలహాదారు తుమ్మల ప్రఫుల్‌రాంరెడ్డి, అధ్యక్షులు లారా, కార్యదర్శి మోహన్ బైరాగిలు మాట్లాడుతూ తెలుగు డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్‌లో వెల్లంకి శ్రీనివాస్, కెడి రాజు, నర్సింహారెడ్డి ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతుందన్నారు. ఈ ముగ్గురు సభ్యత్వం పేరిట సేకరించిన డబ్బుల లెక్కలు తేలిన తర్వాత, దొంగ సభ్యత్వాలను తొలగించిన పిదప ఎన్నికలు నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్‌ను కోరినట్లు వివరించారు.
గత పది సంవత్సరాలుగా యూనియన్‌లో సభ్యత్వాల డబ్బు ఎంత వచ్చింది. రెన్యూవల్స్ డబ్బులు వాటి వివరాలు, వసూళ్లు చేసినవి ఎంత, వాటి వివరాలు ఇప్పటికి చెప్పడంలేదన్నారు. తమ వెనుక గంజాయి బ్యాచ్ ఉందని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కెసిఎస్ ప్రసాద్, శంకర్, గోవింద్‌రాజు, సుజి, రవి, అజయ్‌కుమార్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News