Fraud: పెట్టుబడి పేరుతో రూ.23 కోట్ల మోసం!
ABN , Publish Date - May 23 , 2025 | 04:28 AM
ఆస్పత్రి నిర్మాణంతో పాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి రూ.23 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని ఓ ఎన్నారై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మాజీ ఐఏఎస్ దయాచారిపై ఎన్నారై ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రి నిర్మాణంతో పాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి రూ.23 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని ఓ ఎన్నారై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న కొమ్మినేని కళ్యాణ్(59)కు స్నేహితుల ద్వారా 2015 ఫిబ్రవరిలో దయాచారి పరిచయమయ్యారు. గుంటూరులో ‘కుగ్లర్’ పేరుతో ఆస్పత్రిని కడుతున్నామని, అందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ చూపారు. 2015లో సింగపూర్ సంస్థకు ఇసుక సరఫరా చేసే కాంట్రాక్టు దక్కించుకున్నామని, తర్వా త ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఎల్‌పీజీ సప్లై కాంట్రాక్టు దక్కిందని నకిలీపత్రాలను చూపించారు.
ఇవన్నీ నమ్మిన కల్యాణ్ తన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతా నుంచి దయాచారి నిర్వహిస్తున్న ‘ఏపీఐఎన్‌డీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఖాతాలోకి 2015 మార్చిలో 5లక్షల డాలర్లు(అప్పటి డాలర్ మారకం ప్రకారం రూ.3.50 కోట్లు) బదిలీ చేశారు. ఆ తర్వాత దయాచారి స్పందించడం మానేశారు. దీంతో కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను పంపిన డబ్బు డాలర్ మారక విలువ ప్రకారం, వడ్డీతో కలిపి తన పెట్టుబడి రూ.23 కోట్ల వరకు అవుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News