Sheep Distribution Scam: గొర్రెల పంపిణీ కుంభకోణం..
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:07 AM
గొర్రెల పంపిణీ కుంభకోణంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు బుధవారం
చోట్ల ఈడీ సోదాలు
నాటి మంత్రి ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో తనిఖీలు.. కీలక పత్రాలు స్వాధీనం
అధికారులు, బ్రోకర్ల ఇళ్లలోనూ సోదాలు
హైదరాబాద్,జూలై 30 (ఆంధ్రజ్యోతి): గొర్రెల పంపిణీ కుంభకోణంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు బుధవారం హైదరాబాద్‌లో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ అధికారులు, వారి కార్యాలయాలు, దళారులు, గతంలో అరెస్టయిన వ్యక్తుల ఇళ్లతో పాటు నాటి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల మేర కుంభకోణం జరిగిందంటూ గతంలోనే కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అప్పట్లోనే 17మందిని అరెస్టు చేశారు. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో నిరుడు జూన్‌లో ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మెషన్ రిపోర్టు) నమోదు చేసిన ఈడీ అధికారులు ఇప్పటికే పలువురు అనుమానితులను పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. కోట్లలో డబ్బు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలకు లింకులు ఉండటంతో ఈడీ అధికారులు నిశితంగా విచారణ చేపట్టారు. బుధవారం ఈడీ అధికారులు ‘తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవల్‌పమెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్’ మాజీ డైరక్టర్ రామచంద్ర నాయక్, ఈక్రముద్దీన్, మొయినుద్దీన్ ఇళ్లల్లో సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దిల్‌సుక్‌నగర్‌లోని తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదా లు చేపట్టిన ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణం సూత్రధారి ఎవరు? మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పాత్ర ఏమిటి? గొర్రెల యూనిట్లను మోటార్ సైకిళ్లు, ఆటోల్లో తరలించారని బిల్లులు పెట్టినా ఏ విధంగా మంజూరు చేశారు? ఆడిటింగ్ ఎందుకు జరగలేదు? అనే విషయాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో రాష్ట్ర నిధులతో పాటు కేంద్రానికి చెందిన (ఎన్‌సీడీసీ) నిధులను కూడా వాడిన నేపఽథ్యంలో ఈడీ అధికారులు పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News