దేశవ్యాప్తంగా కులగణన అసాధ్యం: ఈటల
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:43 AM
దేశవ్యాప్తంగా కులగణన సాధ్యం కాదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఒక కులం ఒక రాష్ట్రంలో ఒక క్యాటగిరీలో ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో వేరే క్యాటగిరీలో ఉంటుందని తెలిపారు.
వరంగల్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశవ్యాప్తంగా కులగణన సాధ్యం కాదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఒక కులం ఒక రాష్ట్రంలో ఒక క్యాటగిరీలో ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో వేరే క్యాటగిరీలో ఉంటుందని తెలిపారు. బుధవారం వరంగల్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేయడం రాహుల్ గాంధీ అవగాహన లేమి అని విమర్శించారు. తెలంగాణలో కులగణన చేశామని గొప్పలు చెబుతున్నారని, గత ప్రభుత్వం చేసిన కుల గణనలో బీసీలు 52శాతం ఉంటే, ఇప్పుడు 46శాతానికి ఎలా తగ్గారని ప్రశ్నించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే రైతులకు పరిహారం కోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో కమిటీలు వేసి ధరలు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘ఆంధ్రజ్యోతి’ రాసింది వాస్తవమే..
ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలపై ఈటల స్పందించారు. ‘యథా రాజ.. తథా ప్రజ’ అని.. సీఎం ఎలా ఉంటే ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు అలాగే ఉంటారని అన్నారు. చంద్రబాబు, వైఎ్‌సఆర్, కిరణ్ కుమార్‌రెడ్డి, రోశయ్య, కేసీఆర్ లాంటి వాళ్ల వద్ద పని చేసినప్పుడు ఏసీల్లో ఉండని అధికారులు.. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఏసీలకు ఎందుకు పరిమితం అవుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆంరఽధజ్యోతి పత్రికలో వచ్చిన అయ్యో.. ఎస్ కథనంపై ఈటల స్పందించారు. ఒక ఐఏఎస్ పని చేయకుంటే.. ఆయన స్థానంలో మరో ఐఏఎ్‌సను తెచ్చుకునికావాల్సిన పనులు చేయించుకుంటున్నారని అన్నారు.