Medha School Drugs Case: మేథా స్కూల్ డ్రగ్స్ కేసు.. గురువారెడ్డిని అరెస్టు చేసిన ఈగల్ టీం..
ABN , Publish Date - Sep 24 , 2025 | 09:51 AM
మేథా స్కూల్ డ్రగ్స్ కేసులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసును ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్న ఈగిల్ టీమ్ తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్‌కు ఆల్ప్రజోలo తయారీ కోసం ఫార్ములా ఇచ్చిన గురువారెడ్డిని ఈగిల్ టీమ్ అదుపులోకి తీసుకుంది.
మేథా స్కూల్ డ్రగ్స్ కేసులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసును ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్న ఈగిల్ టీమ్ తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది (Medha School case). స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్‌కు ఆల్ప్రజోలo తయారీ కోసం ఫార్ములా ఇచ్చిన గురువారెడ్డిని ఈగిల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. గురువారెడ్డి పై గతంలో కూడా కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు (Guruvareddy arrested).
నార్కోటిక్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తాను ఇలాంటి పనులు చేయలేదని ఈగల్ టీమ్‌కు గురువారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు జయప్రకాష్ గౌడ్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈగల్ టీమ్ కోరింది. కాగా, డబ్బు సంపాదనే లక్ష్యంగా మత్తు మందును తయారు చేసి విక్రయిస్తున్న మేథా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్ గౌడ్‌ను కొన్ని వారాల క్రితం ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. విచారణలో జయప్రకాశ్ గౌడ్ కీలక విషయాలు వెల్లడించాడు (EAGLE team bust).
గురువారెడ్డి అనే వ్యక్తి దగ్గర్నుంచి ఫార్ములాని (alprazolam formula) కొనుగోలు చేశానని, ఆరు సార్లు మత్తుమందు తయారు చేయడంలో ఫెయిల్ అయి, ఏడో సారి సక్సెస్ అయ్యానని జయప్రకాశ్ గౌడ్ వెల్లడించాడు. రోజుకు కిలో చొప్పున మత్తు మందు తయారు చేసి స్కూటీ పైన తీసుకువెళ్లి సప్లై చేశానని జయప్రకాశ్ అంగీకరించాడు. తాను తయారు చేసిన డ్రగ్‌ను మహబూబ్ నగర్‌తో పాటు హైదరాబాదులోని పలు కల్లు కాంపౌండ్లకి సప్లై చేశానని అంగీకరించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Read Latest Telangana News and National News