Dussehra: దసరా రోజున వైన్‌షాపులు బంద్..!
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:34 PM
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ దసరా.. ఈ పర్వదినాన రెండు రాష్ట్రాల ప్రజలు ఫుల్ జోష్‌లో ఉంటారు. బంధుమిత్రులందరినీ తమ ఇళ్లకు ఆహ్వానించి సంతోషంగా దసరాను జరుపుకుంటారు. దసరా రోజున ముక్కా, సుక్కతో ఫుల్ ఖుషీ అవుతారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ దసరా.. ఈ పర్వదినాన రెండు రాష్ట్రాల ప్రజలు ఫుల్ జోష్‌లో ఉంటారు. బంధుమిత్రులందరినీ తమ ఇళ్లకు ఆహ్వానించి సంతోషంగా దసరాను జరుపుకుంటారు. దసరా రోజున ముక్కా, సుక్కతో ఫుల్ ఖుషీ అవుతారు. అయితే, ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించేలా లేదు. ఎందుకంటే.. దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి. దీంతో ఆ రోజున మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికే చాలా వైన్స్ షాపుల వద్ద దసరా రోజున వైన్ షాప్స్ బంద్ అంటూ ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు.. అసలే దసరా.. అక్టోబర్ 2న మందు బంద్ అనడంతో.. మద్యం ప్రియులు వైన్ షాపుల వద్దకు పరుగెత్తుకెళ్తున్నారు. ముందే స్టాక్ తీసుకెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Hair Care Tips: రోజూ స్ట్రెయిట్‌నర్ ఉపయోగిస్తున్నారా? ఇది తెలుసుకోండి..
CM Yogi Adityanath: యోగిని పాతిపెడతాం.. రెచ్చిపోయిన మౌలానా
MLA Anirudh On Aurobindo Pharma: అరబిందో కంపెనీపై ఎమ్మెల్యే అనిరుద్ ఫైర్.. తగలబెడతా అంటూ..