Hair Care Tips: రోజూ స్ట్రెయిట్‌నర్ ఉపయోగిస్తున్నారా? ఇది తెలుసుకోండి..
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:12 PM
ఒక వ్యక్తి అందంగా కనిపించేందుకు ముఖానికి మేకప్ వేసుకుంటారు. మంచి ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తారు. అలాగే అన్నింటికంటే ముఖ్యమైనది కేశాలంకరణ. జుట్టును ఆకర్షణీయంగా మలుచుకుంటారు. అవును, మనం ఎంత రెడీ అయినా.. కేశాలంకరణ సరిగా లేకపోతే అస్సలు..
ఒక వ్యక్తి అందంగా కనిపించేందుకు ముఖానికి మేకప్ వేసుకుంటారు. మంచి ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తారు. అలాగే అన్నింటికంటే ముఖ్యమైనది కేశాలంకరణ. జుట్టును ఆకర్షణీయంగా మలుచుకుంటారు. అవును, మనం ఎంత రెడీ అయినా.. కేశాలంకరణ సరిగా లేకపోతే అస్సలు ఆకర్షణీయంగా కనిపించరు. కేశాలంకరణ వ్యక్తిని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే స్త్రీ అయినా.. పురుషుడు అయినా.. తమ జుట్టు పొడవుగా, అందంగా ఉండాలని ఆశిస్తుంటారు. ఈ క్రమంలోనే వ్యక్తులు తమ జుట్టుకు రకరకాల కాస్మొటిక్స్, క్రీమ్స్ అప్లై చేస్తుంటారు. హెయిర్ డ్రయర్స్ వాడుతుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను వినియోగిస్తారు. హెయిర్ స్ట్రెయిట్‌నర్‌తో జుట్టును సిల్కీగా, స్ట్రెయిట్‌గా చేసుకుంటారు. అయితే.. వీటిని అతిగా వాడితే నష్టపోతారంటూ లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. మీ జుట్టు పాడైపోయే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.
ముఖ్యంగా.. హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించే వారికి సీరియస్ వార్నింగే ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించడం వల్ల ఇన్‌స్టాంట్ అందాన్ని పొందవచ్చు గానీ.. పోను పోను.. జుట్టు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజూ హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు దెబ్బతింటుందని చెబుతున్నారు. సరైన అవగాహన, రక్షణ లేకుండా స్ట్రెయిట్ చేయడం తరువాత బాధపడుతారని చెబుతున్నారు. ప్రతిరోజూ హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలేంటి.. ఆరోగ్య నిపుణులు ఏం వార్నింగ్ ఇస్తున్నారు. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలివే..
జుట్టు పొడిబారుతుంది: హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించడం వల్ల జుట్టులో సహజ తేమ తొలగిపోతుంది. నిస్తేజంగా మారి.. పొడిబారినట్లు అవుతుంది. అందుకే.. ప్రతిరోజూ హెయిర్ స్ట్రెయిట్‌నర్‌లను ఉపయోగించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు పొడిబారితే.. అంది అందవిహీనంగా కనిపిస్తుందని.. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.
జుట్టు రాలుతుంది: ప్రతిరోజూ స్ట్రెయిట్‌నర్‌ను వాడటం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. బలహీనమైన జుట్టు మూలాలు క్రమంగా జుట్టు రాలడానికి దారితీస్తాయి. జుట్టు చివరలు చిట్లడం వంటి సమస్యకు దారితీస్తుంది. ఫలితంగా జుట్టు మరింత నిర్జీవంగా కనిపిస్తుంది.
తల చర్మంపై ప్రభావం: హెయిర్ స్ట్రెయిట్‌నర్ వేడి అవుతుంది. ఈ వేడి పరికరాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల తల చర్మం సైతం ప్రభావితం అవుతుంది. చర్మం పొడిబారుతుంది. దీని కారణంగా చుండ్రు, దురద వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యలు చాలా తీవ్రంగా మారుతాయి.
జుట్టు రంగు పోతుంది: మీ జుట్టుకు కలర్స్, డై వాడితే.. అదే సమయంలో హెయిర్ స్ట్రెయిటర్‌ను కూడా వాడినట్లయితే జుట్టు సహజ రంగు కోల్పోతుంది. రోజూ దీనిని వినియోగించడం వలన జుట్టు సహజ ఆకృతి దెబ్బ తింటుంది.
జుట్టును ఇలా కాపాడుకోండి..
1. హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించే ముందు హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే చేయాలి.
2. వారానికి రెండుసార్లు జుట్టుకు డీప్ కండిషనర్ చేయాలి.
3. జుట్టును సహజంగా ఆరనివ్వాలి.
4. వారానికి ఒకటి లేదా రెండుసార్ల కంటే ఎక్కువసార్లు హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ని ఉపయోగించవద్దు.
ఇవి కూడా చదవండి..
CM Yogi Adityanath: యోగిని పాతిపెడతాం.. రెచ్చిపోయిన మౌలానా
MLA Anirudh On Aurobindo Pharma: అరబిందో కంపెనీపై ఎమ్మెల్యే అనిరుద్ ఫైర్.. తగలబెడతా అంటూ..