Share News

DGP Jitender: సేఫ్‌ స్టే ప్రాజెక్టును అన్ని కమిషనరేట్లలో అమలు చేయాలి

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:42 AM

మహిళల భద్రతకు సంబంధించి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అమలు చేస్తున్న

DGP Jitender: సేఫ్‌ స్టే ప్రాజెక్టును అన్ని కమిషనరేట్లలో అమలు చేయాలి

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు సంబంధించి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అమలు చేస్తున్న సేఫ్‌ స్టే ప్రాజెక్టును.. హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో కూడా ప్రారంభించాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ జితేందర్‌ ఆదేశించారు. నగరంలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయా కమిషనరేట్ల ఉన్నతాధికారులతో డీజీపీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. సైబరాబాద్‌ పోలీసులు చేపట్టిన సేఫ్‌ స్టే ప్రాజెక్టులో భాగంగా.. వసతి గృహాల్లో ఉంటున్న మహిళల భద్రతకు భరోసా కల్పించారని, ఇదే విధానాన్ని ఇతర కమిషనరేట్లలో తక్షణమే అమలు చేయాలన్నారు. భరోసా కేంద్రాలు, కుటుంబ సలహా కేంద్రాలు, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లు, షీ టీమ్స్‌ కార్యక్రమాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ చారు సిన్హా, డీఐజీ రెమా రాజేశ్వరి, రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు, సైబరాబాద్‌ కమిషనర్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 06:42 AM