Share News

Telangana Divyang Pension: దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:38 AM

తెలంగాణలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. చేయూత పింఛన్‌ దారులకు ఇచ్చే..

Telangana Divyang Pension: దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి

  • ఆగస్టు మొదటి వారంలోపు పింఛన్‌ ఇవ్వాలి: మందకృష్ణ

పంజాగుట్ట, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. చేయూత పింఛన్‌ దారులకు ఇచ్చే పింఛన్‌ వెంటనే పెంచి ఇవ్వాలి. లేదంటే సీఎం రేవంత్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. ఏపీలోనూ సీఎం చంద్రబాబు తీవ్ర వైకల్యం గల దివ్యాంగులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలి’’ అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆగస్టు మొదటి వారంలోపు దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో వేలాదిమంది దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారులతో కలిసి గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:38 AM