PRTU: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:59 AM
మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎ్‌స)ను రద్దు చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ వ్యవస్థాపక ..
పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలి: పీఆర్టీయూ
కవాడిగూడ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎ్‌స)ను రద్దు చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు జి. హర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో పాత పెన్షన్ విధానంలోకి వెళ్లే ఆప్షన్ ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చి ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో పీఆర్‌టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడారు. హిమాచల్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్లుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా సీపీఎ్‌సను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి బి.రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News