Share News

Damodar Rajanarsimha: సమాజ పురోగాభివృద్ధికి మహిళల కృషి

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:09 AM

అన్ని రంగాల్లో మహిళలు కీలకపాత్ర పోషించి, సమాజ గుణాత్మక పురోగాభివృద్థికి కృషి చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం ఆయన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Damodar Rajanarsimha: సమాజ పురోగాభివృద్ధికి మహిళల కృషి

  • వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : అన్ని రంగాల్లో మహిళలు కీలకపాత్ర పోషించి, సమాజ గుణాత్మక పురోగాభివృద్థికి కృషి చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం ఆయన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లింగ సమానత్వాన్ని సాధించడానికి, మహిళలకు సమాన అవకాశాలను కల్పించడానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తు చేస్తూ, వాటిని ఉపయోగించుకోవాలని మహిళలను కోరారు. ప్రభుత్వ దవాఖాన్లలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్‌లను నిర్వహిస్తున్నామని, సంతాన సాఫల్య చికిత్స కోసం ఐవీఎఫ్‌ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.


ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమానికి తమ నేత సీఎం రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. కాగా, లైంగిక వేధింపుల నిరోధానికి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘ మహిళా విభాగం ప్రభుత్వాని డిమాండ్‌ చేసింది. శనివారం కోఠిలోని సంఘ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకొకమారు ప్రత్యేక గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని ఉద్యోగులు ఈ సందర్భంగా కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 03:09 AM