Telangana Beedi Workers: గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:42 AM
రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకు చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని
రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకు చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మంగళవారం డిమాండ్ చేశారు. గీత కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం హామీలు ఇస్తుందే తప్ప నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు. విధి నిర్వహణలో చాలా మంది గీత కార్మికులు ప్రమాదాల బారిన పడ్డారని తెలిపారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.12.96 కోట్ల ఎక్స్‌గ్రేషియా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. తక్షణమే సీఎం స్పందించి గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిధులు విడుదల చేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి