Share News

Dr. Narendra Kumar: డీఎంఈలో కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పదవీకాలం ఏడాది పొడిగింపు

ABN , Publish Date - Jun 30 , 2025 | 05:46 AM

వైద్యవిద్య సంచాలకుల డీఎంఈ పరిధిలోని 16,448 కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పదవీ కాలాన్ని ప్రభు త్వం మరో ఏడాది పాటు పొడిగించింది.

 Dr. Narendra Kumar: డీఎంఈలో కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పదవీకాలం ఏడాది పొడిగింపు

  • 16,448 మంది సిబ్బంది కొనసాగింపు

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని 16,448 కాంట్రా క్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పదవీ కాలాన్ని ప్రభు త్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నాటికే ఈ పోస్టుల కాలపరిమితి ముగిసింది. అయితే, కొత్త కాలేజీలు ఏర్పాటైన నేపథ్యంలో వీటిని కొనసాగించాలని వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు వీటిని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.


ఈ పోస్టు ల్లో 4772 కాంట్రాక్టు, 8615 పోస్టులు అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో, మరో 3056 పోస్టులు గౌరవ వేతనంతో, ఇంకో ఐదు పోస్టులు ఎంటీఎస్‌ (మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌) బేస్‌లో ఉన్నట్లు ఆ ఉత్తర్వులో వివరించింది. కాగా, రెగ్యులర్‌ పోస్టులు భర్తీ అయ్యేలోపు లేదా అవసరం ఉన్నంత మేరకే వీరంతా కొనసాగుతారని పేర్కొంది.

Updated Date - Jun 30 , 2025 | 05:47 AM