Share News

వచ్చే నెలలో కాంగ్రెస్‌ సభ

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:30 AM

తెలంగాణలో ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ‘సంవిధాన్‌ బచావో’ పేరుతో ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేటలో గానీ, ఖమ్మంలో గానీ ఈ సభను నిర్వహిస్తామని, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని చెప్పారు.

వచ్చే నెలలో కాంగ్రెస్‌ సభ

  • సూర్యాపేట లేదా ఖమ్మంలో ‘సంవిధాన్‌ బచావో’ పేరిట సభ.. రాహుల్‌ హాజరు

  • నెలాఖరుకు నామినేటెడ్‌ పదవులు: మహేశ్‌

  • రాష్ట్ర మంత్రులతో కేసీ వేణుగోపాల్‌ భేటీ

న్యూఢిల్లీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ‘సంవిధాన్‌ బచావో’ పేరుతో ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేటలో గానీ, ఖమ్మంలో గానీ ఈ సభను నిర్వహిస్తామని, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఈ నెలాఖరుకు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరిగింది.


దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీతోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంస్థాగత అంశాలతోపాటు ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ కార్యవర్గ కూర్పుపె ౖసమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్‌ ప్రశంసించారని, జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సిందిగా దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ఇక క్యాబినెట్‌ విస్తరణపై ముఖ్యమంత్రి, అధిష్ఠానం కలిసి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. డీసీసీ అధ్యక్ష పదవులు.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్నవారికే దక్కుతాయన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 03:30 AM