Share News

Congress MPs: కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నారు!

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:19 AM

తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి ఒక స్థాయి ఇచ్చారని, ఆ విషయాన్ని విస్మరించి కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి, రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు.

Congress MPs: కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నారు!

సీఎంపై వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం

  • ఇకనైనా మారకపోతే ప్రజలు తరిమికొడతారు

  • రాష్ట్ర పెండింగ్‌ ప్రాజెక్టులపై అన్ని పార్టీల ఎంపీలతో వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రిని కలుస్తాం

  • ఫిరాయింపులపై సుప్రీం ఇచ్చింది నోటీసులే.. తీర్పు కాదు

  • ఢిల్లీలో మీడియాతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి ఒక స్థాయి ఇచ్చారని, ఆ విషయాన్ని విస్మరించి కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి, రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. సోమవారమిక్కడి తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, ఎంపీలు కందుల రఽఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, ఆర్‌.రఘురామ్‌రెడ్డి, సురేష్‌ షట్కార్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో కేటీఆర్‌ మాటల వల్లే రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎ్‌సకు ఓట్లతో బుద్ధి చెప్పారని.. ఇకనైనా మారకపోతే తరిమికొడతారని మల్లు రవి హెచ్చరించారు. తెలంగాణ పెండింగ్‌ ప్రాజెక్టులను సాధించేందుకు అన్ని పార్టీల ఎంపీలతో వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తామని చెప్పారు. తెలంగాణలో 55 సమీకృత గురుకులాల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. మామునూరు విమానాశ్రయానికి ఇటీవలే నిరంభ్యంతర పత్రం వచ్చిందన్నారు. 253 ఎకరాల భూ సేకరణను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూల నిర్ణయం తీసుకున్న మొదటి సీఎంగా రేవంత్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కాంగ్రెస్‌ ఎంపీ రఘువీర్‌రెడ్డి చెప్పారు. రాజకీయ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగానే ఉంటామన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు మాత్రమే ఇచ్చిందన్నారు. తుదితీర్పు ఇవ్వాల్సి ఉందని, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసే వారికే పదవులు దక్కుతాయని మరోసారి తేలిందన్నారు. నల్లగొండ జిల్లాకు నాలుగు ఎమ్మెల్సీ సీట్లు యాదృచ్ఛికంగానే వచ్చాయని, అది తమ జిల్లా అదృష్టమని చెప్పారు. విజయశాంతి తెలంగాణ కోసం కష్ట పడ్డారని తెలిపారు.


‘ఫోన్‌ ట్యాపింగ్‌’ పేటెంట్‌ బీఆర్‌ఎ్‌సదే..

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ పేటెంట్‌ హక్కులు బీఆర్‌ఎ్‌సవేనని కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. తామెప్పుడూ ఈ-కార్‌ రేసును తప్పు పట్టలేదని, అందులో జరిగిన అవినీతిని మాత్రమే ప్రశ్నించామని గుర్తుచేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలని, ఆ విషయాన్ని కేటీఆర్‌, కిషన్‌రెడ్డి గ్రహించాలని హితవు పలికారు. భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ గెలిస్తే, సంబరాలను ఎవరైనా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. ఇక రాజకీయ అజెండాతోనే రామగుండం విమానాశ్రయాన్ని అడ్డుకుంటున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. హైదరాబాద్‌ తర్వాత రెండో పారిశ్రామిక నగరమైన కొత్తగూడెంలో విమానాశ్రయం ఎంతో అవసరమని ఎంపీ రఘురామ్‌రెడ్డి అన్నారు. త్వరలోనే విమానాశ్రయానికి అనుమతులు వస్తాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 11 , 2025 | 04:19 AM