Share News

Kaleshwaram Project: ఇక.. కేసీఆర్‌ ఆస్తులు ఎంత ఉంటాయో?

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:13 AM

మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావు వద్దే రూ.500కోట్ల పైబడి ఆస్తులు ఉంటే.. ఇక కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు వద్ద ఎన్ని ఆస్తులు ఉంటాయో ఎవరికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

Kaleshwaram Project: ఇక.. కేసీఆర్‌ ఆస్తులు ఎంత ఉంటాయో?

  • అవినీతిపరుల ఆస్తులను పేదలకు పంచాలి

  • ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌, మేడిపల్లి సత్యం

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావు వద్దే రూ.500కోట్ల పైబడి ఆస్తులు ఉంటే.. ఇక కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు వద్ద ఎన్ని ఆస్తులు ఉంటాయో ఎవరికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వామ్యమైన వారిలో ఎవరి ఆస్తులు లెక్క కట్టినా అంచనాలకు మించి తేలుతున్నాయన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఎమ్మెల్యే మదన్‌మోహన్‌.. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంలో అవినీతిపై ప్రభుత్వం పకడ్బందీగా విచారణ చేపట్టాలని, దోపిడీదారుల ఆస్తులు జప్తు చేసి పేద ప్రజలకు పంచాలని అభిప్రాయపడ్డారు. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాళేశ్వరంలో జరిగిన దోపిడీపై హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి దళితులను పట్టించుకోని కేటీఆర్‌.. ఇప్పుడు ఆయా వర్గాల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని రెచ్చగొడుతున్న ఆయన.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.


సీఐడీ కస్టడీకి జగన్‌మోహన్‌రావు బృందం హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌ కోసం గాలింపు

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిధుల దుర్వినియోగ ఆరోపణల కేసులో అరెస్టు అయిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు సహా అయిదుగురిని ఆరు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ మల్కాజిగిరి కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. వారిని విచారణ చేయడానికి పది రోజులు కావాలని సీఐడీ కోరగా ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో హెచ్‌సీఏ అఽధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, శ్రీనివాసరావు, సునీల్‌ కాంతే, రాజేందర్‌ యాదవ్‌, కవితలను సీఐడీ అధికారులు జైలు నుంచి గురువారం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌ రామచందర్‌ను పట్టుకోవడం కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు. మరోవైపు హెచ్‌సీఏ కార్యవర్గంపై మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల క్రికెట్‌ అసోసియేషన్లు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. జిల్లా క్రికెట్‌ అభివృద్ధికి ఏటా 20 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పినప్పటికీ, ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో నిధుల గోల్‌మాల్‌ బయపడిందని పేర్కొన్నాయి. ఇప్పటికే జగన్‌మోహన్‌రావు బృందంపై ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, మోసం, బ్లాక్‌మెయిలింగ్‌, బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ కూడా మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తునకు సన్నద్ధమయింది. సీఐడీ నుంచి ఎఫ్‌ఐఆర్‌, వాంగ్మూలాలను ఈడీ అధికారులు సేకరించారు.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:13 AM