Share News

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ABN , Publish Date - Aug 17 , 2025 | 03:53 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమితులైన కార్పొరేషన్‌ చైర్మన్లు, బూత్‌ ఇన్‌చార్జిలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ సూచించారు.

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

  • కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేది కాంగ్రెస్సే

  • పని చేయలేని వాళ్లు తప్పుకోండి

  • బూత్‌ కమిటీ ఇన్‌చార్జిలతో మంత్రి తుమ్మల, పొన్నం

హైదరాబాద్‌/వెంగళరావునగర్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమితులైన కార్పొరేషన్‌ చైర్మన్లు, బూత్‌ ఇన్‌చార్జిలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ సూచించారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ముఖ్య నేతలతో శనివారం వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వెంగళరావునగర్‌ డివిజన్‌లో బూత్‌ కమిటీలు సక్రమంగా లేవని, స్థానికంగా ఉండి పని చేయలేని వారు.. ఇన్‌చార్జి మంత్రికి చెప్పి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు. ఉప ఎన్నికను సీఎం రేవంత్‌, పార్టీ అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధికి సీఎం రేవంత్‌ చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావాలంటే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించాలన్నారు. హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అందుకే ఇతర రాష్ట్రాల వారు సైతం ఇక్కడ నివసించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.


కార్యకర్తలు, నాయకులకు సరైన గుర్తింపు ఇచ్చేది కాంగ్రెస్సేనని, పార్టీలోకి ఎవరు వచ్చి మద్దతు తెలిపినా ఆహ్వానించాలని సూచించారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా సీఎంతో మాట్లాడి, పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఉప ఎన్నిక ప్రభావం ఇతర రాష్ట్రాల పై కూడా ఉంటుందని పేర్కొన్నారు. దే శంలో ప్రతి రాష్ట్రం తెలంగాణను మోడల్‌ గా తీసుకుంటుందని తెలిపారు. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల మాటలు నమ్మొద్దని చెప్పారు. నేతలంతా ఐక్యంగా పని చేయాలని, ప్రతి బూత్‌లో మంచి మెజారిటీ వచ్చేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి ఎవరైనా విజయం కోసం పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఎర్రగడ్డ డివిజన్‌ బూత్‌ ఇన్‌చార్జిలతో భేటీలో ఆయన మాట్లాడుతూ ఒక్కో డివిజన్‌లోని సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, పెండింగ్‌ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా తానే పాదయాత్ర చేస్తూ డివిజన్లలో సమస్యలు తెలుసుకుంటానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 03:53 AM