Winter Temperatures: కోహీర్ @ 8.1 డిగ్రీలు
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:31 AM
రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గడం లేదు. పలు జిల్లాల్లో వరుసగా ఆరో రోజూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సిర్పూర్ (యూ)లో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
వరుసగా ఆరోరోజు పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
కోహీర్/ ఆసిఫాబాద్/ సిరిసిల్ల/ ఆదిలాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గడం లేదు. పలు జిల్లాల్లో వరుసగా ఆరో రోజూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో సోమవారం ఉదయం 8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 8.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. తిర్యాణి మండలం గిన్నెధరిలో 9.1, కెరమెరిలో 10.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 11 డిగ్రీలు, తంగళ్లపల్లి, బోయినపల్లిలో 12.6, రుద్రంగి, ఇల్లంతకుంటలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 8.9, బోథ్‌లో 9.5, బేలలో 9.8, ఉట్నూర్‌లో 11.0, తలమడుగులో 11.7, మావలలో 12.1, ఇంద్రవెల్లిలో 13.7, గుడిహత్నూర్‌లో 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి వరకు రాష్ట్రంలో చలి ప్రభావం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.