Share News

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ చేతుల మీదుగా 14న 423 మందికి నియామక పత్రాలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:40 AM

నీటిపారుదల శాఖలో ఇటీవలే ఎంపికైన 199 మంది జూనియర్‌ టెక్నికల్‌ అధికారులు(జేటీవో), 224 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లు(ఏఈ)లకు 14న సీఎం రేవంత్‌ నియామక పత్రాలు అందించనున్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ చేతుల మీదుగా 14న 423 మందికి నియామక పత్రాలు

  • ఏర్పాట్లు పూర్తి చేసిన నీటిపారుదల శాఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖలో ఇటీవలే ఎంపికైన 199 మంది జూనియర్‌ టెక్నికల్‌ అధికారులు(జేటీవో), 224 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లు(ఏఈ)లకు 14న సీఎం రేవంత్‌ నియామక పత్రాలు అందించనున్నారు. రాజేంద్రనగర్‌లోని వాలంతరీలో జరిగే కార్యక్రమంలో ఆయన వీరికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దీనికోసం ఇప్పటికే నీటిపారుదల శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. తుది దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేశారు.


మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించడానికి వీలుగా గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వాలంతరీని సందర్శించనున్నారు. నియామక పత్రాలు అందించే కార్యక్రమం పూర్తయ్యాక వివిధ ప్రాజెక్టుల పనులపై సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌తో కలిసి, సమీక్ష చేయనున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 04:40 AM