CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక సమీక్ష
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:50 PM
సీఎం రేవంత్ రెడ్డి గురువారం అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై ఈ భేటీలో చర్చించారు. తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025పై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై ఈ భేటీలో చర్చించారు. పాలసీ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్(CM Revanth Reddy) అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా.. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సూచించారు. 2034 నాటికి ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేలా స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీలో ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు సూచించారు.
కాగా డిసెంబర్ 8,9 తేదీల్లో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు సీఎం రేవంత్ ఇప్పటికే వెల్లడించారు. కేంద్ర మంత్రులతో పాటు సమ్మిట్‌కు ఆహ్వానించాల్సిన దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖుల జాబితా ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
ఇవి కూడా చదవండి:
దీప్తి శర్మకు జాక్‌పాక్.. రూ. కోట్లు కుమ్మరించిన యూపీ