WPL 2026: డబ్ల్యూపీఎల్ ఎప్పటినుంచంటే..?
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:55 PM
మహిళల ప్రీమియర్ లీగ్.. జనవరి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ మెగా టోర్నీ కొనసాగనున్నట్లు తెలిపింది. మరోవైపు ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2026) సందడి ఇప్పటికే మొదలైంది. తాజాగా దీనికి సంబంధించి క్రీజీ అప్‌డేట్ వచ్చింది. జనవరి 9న నుంచి డబ్ల్యూపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. నవీ ముంబై, వడోదరలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
అన్‌సోల్డ్ అయిన హీలీ
డబ్ల్యూపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. ఇందులో ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ అన్‌సోల్డ్ అయింది. ఆరు సార్లు జట్టుకు టీ20 ప్రపంచ కప్‌ను అందించిన కెప్టెన్‌గా హీలీకి రికార్డు ఉంది. డబ్ల్యూపీఎల్‌లో ఈమె కనీస ధర రూ.50 లక్షలు. కాగా హీలీని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఎవరికి ఎంతంటే..?
దీప్తి శర్మ- రూ.3.20కోట్లు (యూపీ వారియర్స్)
సోఫీ డివైన్ - రూ.2 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
అమెలియా కెర్ - రూ.3 కోట్లు (ముంబయి ఇండియన్స్)
రేణుకా సింగ్ - రూ.60లక్షలు (గుజరాత్ జెయింట్స్)
సోఫీ ఎకిల్‌స్టోన్ - రూ.85లక్షలు (యూపీ వారియర్స్) (ఆర్‌టీఎం)
మెగ్ లానింగ్ - రూ.1.90 కోట్లు (యూపీ వారియర్స్)
లారా వొల్వార్డ్ - రూ.1.10లక్షలు (దిల్లీ క్యాపిటల్స్)
ఇవి కూడా చదవండి:
బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ