CM Revanth Reddy: గోశాలల సంరక్షణ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ABN , Publish Date - Jun 17 , 2025 | 09:32 PM
రాష్ట్రంలో గో సంరక్షణ కోసం సమగ్ర విధానం రూపొందించాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల సంరక్షణ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో గో సంరక్షణ కోసం సమగ్ర విధానం రూపొందించాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల సంరక్షణ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. గోసంరక్షణ పాలసీ తయారీ కోసం ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు (Telangana News).
పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉండబోతున్నారు. వివిధ రాష్ట్రాల్లో గోసంరక్షణ విధానాల పై లోతైన అధ్యయనం చేయాలని ఆ ముగ్గురికీ సీఎం సూచించారు. గో సంరక్షణ కోసం రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందుగా వేములవాడ సమీపంలో 100 ఎకరాల్లో గోశాల నిర్మించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News And Telugu News