Y Sathish Reddy: రాష్ట్రం, దేశం పరువు తీశారు
ABN , Publish Date - May 25 , 2025 | 05:01 AM
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర, దేశ పరువు తీశారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర, దేశ పరువు తీశారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి అన్నారు. తమని వేశ్యలా చూశారని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై ఆయన ఓ ప్రకటనలో స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. మిస్‌వరల్డ్ పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని, ఈ పోటీలతో పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్ ప్రగల్బాలు పలికారని ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి రాష్ట్ర, దేశ పరువు ప్రతిష్టలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
అందాల పోటీలంటే మహిళలను కించపర్చడమే
స్పష్టం చేసిన సీపీఐ నేత నారాయణ
ఖమ్మం, మే 24 (ఆంధ్రజ్యోతి): అందాల పోటీలు జరుగుతున్నప్పుడు మహిళలను కించపరిచారని పోటీదారులే ఆరోపిస్తుంటే ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా ‘సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలువలేని చోట తాను ఉండదలుచుకోలేదని చెప్పారని గుర్తు చేశారు. అందాల పోటీల్లో పాల్గొనే వారిని వేశ్యల్లా చూస్తున్నారని ఆమె తెలిపిందని నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా అందాల పోటీలపై మాట్లాడే వారు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. తనపై వెటకారంగా విమర్శలు చేసిన వారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. అందాల పోటీలు నిర్వహించడమంటేనే మహిళలను కించపర్చడమని నారాయణ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..