CM Revanth Reddy: యుద్ధంలో మేమే ముందున్నాం
ABN , Publish Date - May 15 , 2025 | 03:37 AM
భారత్- పాకిస్థాన్ యుద్ధం విషయంలో బీజేపీ కంటే కాంగ్రెసే ముందుందని, బీజేపీ కంటే ముందే కాంగ్రెస్ ఎప్పుడో యుద్ధం చేసి చూపించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డితో సీఎం సరదా సంభాషణ
సమాచార కమిషనర్లకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): భారత్- పాకిస్థాన్ యుద్ధం విషయంలో బీజేపీ కంటే కాంగ్రెసే ముందుందని, బీజేపీ కంటే ముందే కాంగ్రెస్ ఎప్పుడో యుద్ధం చేసి చూపించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై, వెళ్తున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి.. సీఎంకు ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ ఆయనతో కొద్దిసేపు సరదాగా మాట్లాడారు.
యుద్ధం విషయంలో మీకంటే మేమే ముందున్నామన్న సీఎం వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాకేశ్ స్పందిస్తూ.. మేము చేయాల్సింది చేశాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఇంకా అయిపోలేదని అన్నారు. కాగా, అంతకుముందు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌కు నియామకమైన బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాస్, పర్వీన్, దేశాల భూపాల్‌లను కమిషనర్లుగా సచివాలయంలో ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News