Share News

Child Marriage Prohibition: మీ కళ్లెదుట బాల్య వివాహం జరుగుతుందా? ఈ నెంబర్‌కి కాల్ చేయండి..

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:56 PM

ప్రస్తుత టెక్ యుగంలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఆయా దేశాల ప్రజలు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని.. ప్రగతిపథంలో ముందుకెళ్తున్నారు. మనం దేశంలోనూ ప్రగతిశీల భావజాలంతో ఉన్నవారు చాలా మందే ఉన్నారు. అయితే, కొందరు మాత్రం ఏళ్లనాటి మూఢనమ్మకాలను పట్టుకుని..

Child Marriage Prohibition: మీ కళ్లెదుట బాల్య వివాహం జరుగుతుందా? ఈ నెంబర్‌కి కాల్ చేయండి..
Child Marriage Prohibition

ప్రస్తుత టెక్ యుగంలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఆయా దేశాల ప్రజలు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని.. ప్రగతిపథంలో ముందుకెళ్తున్నారు. మనం దేశంలోనూ ప్రగతిశీల భావజాలంతో ఉన్నవారు చాలా మందే ఉన్నారు. అయితే, కొందరు మాత్రం ఏళ్లనాటి మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. ప్రపంచమంతా ఓవైపు పయనిస్తుంటే.. వీరు మాత్రం తిరోగమనంలో పయనిస్తుంటారు. అవును, మన దేశంలో.. మన రాష్ట్రంలో.. మన జిల్లాలోనే.. మన ప్రాంతంలోనే ఎన్నో అరాచకాలు, అమానవీయ ఘటనలు, మూఢనమ్మకాలతో మూర్ఖపు పనులు చేసేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి మూర్ఖపు పనుల్లో బాల్య వివాహం ప్రధానంగా చెప్పొచ్చు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొన్నిచోట్ల ఈ బాల్య వివాహాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అధికారులు ఆయా గ్రామాల్లో బాల్య వివాహాల నిరోధ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో బాల్య వివాహాల నిరోధానికి టోల్ ఫ్రీ నెంబర్, ఉచిత న్యాయ సహాయం అందించటం గురించిన పోస్టర్‌లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని ఆవిష్కరించారు. ఈ పోస్టర్లను ఆటోలకు అతికించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షాలిని.. సమాజంలో బాల్య వివాహాలను అందరూ కలిసికట్టుగా అరికట్టడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం అందితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. బాల్య వివాహాలు చట్ట విరుద్దమని, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళలకు, 3 లక్షల లోపు రూపాయల ఆదాయం ఉన్నవారికి ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. ఉచిత న్యాయ సలహా పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి 21 ఏళ్ళు నుండిన అబ్బాయికి వివాహం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ కృష్ణ తేజ్, న్యాయవాదులు, సీ.ఐ మహేందర్ రెడ్డి, ఎస్.ఐ లు పాల్గొన్నారు.


Also Read:

జీరాంజీ బిల్లుతో పేదలకు లాభం లేదు: రాఘవులు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి బిగ్ అలర్ట్.. ఆ పనిచేస్తే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని

ముందుండి నడిపించేది వారే: చంద్రబాబు

Updated Date - Dec 20 , 2025 | 04:56 PM