Share News

Hyderabad: పహల్గాం దాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ..

ABN , Publish Date - Apr 25 , 2025 | 08:56 PM

పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఎంఐ ఎంపీ అసదుద్దీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా..

Hyderabad: పహల్గాం దాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ..
Chief Minister Revanth Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 25: పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఎంఐ ఎంపీ అసదుద్దీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా.. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. పర్యాటకులపై దాడి చేసి చంపేయడం తీవ్రమైన ఘటన అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీలకు అతీతంగా పని చేస్తూ తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీల విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.


పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. గ్రామ గ్రామాన నిరసన ర్యాలీలు చేపట్టారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూనే.. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. పర్యాటకులను చంపేసిన ఉగ్రమూకల అంతు చూడాలని ప్రజలందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.


Also Read:

సింధు రద్దు వల్ల ఇండియాకు కలిగే లాభాలేంటి..

డాక్టర్ నిర్లక్ష్యం.. మహిళ కడుపులో అర మీటర్ గుడ్డ

నిప్పు లేకుండానే స్టవ్ వెలిగించాడుగా.. ఇతడి అతి

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 08:56 PM