Road Accident: చేవెళ్ల ఘటన.. సంతాపం ప్రకటించిన కేసీఆర్, కేటీఆర్, కవిత
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:31 AM
చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చేవెళ్ల, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలని.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
Khanapur Road Accidents: ఇప్పటివరకు 200 మంది మృతి, 600 మందికి గాయాలు.. ఎందుకిలా?
MLA Kale Yadayya: చేవెళ్ల ప్రమాదం.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ