Weather Updates: మరికాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..!
ABN , Publish Date - May 20 , 2025 | 04:01 PM
Telangana Weather Updates: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏ ప్రాంతాల్లో వర్షం కురవనుంది. ఏయే జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్, మే 20: తెలంగాణ వాసులను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. అలాగే, సూర్యాపేట, ఖమ్మం, భద్రాది జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇక సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. రైతులు, వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలన్నారు.
Also Read:
అల్లుడితో అత్త ఎఫైర్.. కాల్ డేటా పట్టించేసింది..
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
రెండు రైళ్లకు తృటిలో తప్పిన ప్రమాదం
For More Telangana News and Telugu News..