Share News

దేశీయంగా ఈవీల తయారీకే ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:55 AM

దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, మౌలిక వసతు ల కల్పనపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర రైల్వే, సమాచార, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. దేశంలో స్టీల్‌, రసాయనాల మాదిరిగా బ్యాటరీ, సెల్‌ టెక్నాలజీపై నూతన పరిశోధన లు జరగాల్సిన అవసరముందన్నారు.

దేశీయంగా ఈవీల తయారీకే ప్రాధాన్యం

బ్యాటరీ, సెల్‌ టెక్నాలజీపై నూతన పరిశోధనలు జరగాలన్న అశ్వినివైష్ణవ్‌

  • దివిటిపల్లి ఐటీ కారిడార్‌లో అమర్‌రాజా నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, మౌలిక వసతు ల కల్పనపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర రైల్వే, సమాచార, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. దేశంలో స్టీల్‌, రసాయనాల మాదిరిగా బ్యాటరీ, సెల్‌ టెక్నాలజీపై నూతన పరిశోధన లు జరగాల్సిన అవసరముందన్నారు. శనివారం మ హబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి ఐటీ కారిడార్‌లో రూ. 3225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటుకానున్న అమర్‌రాజా గిగా ఫ్యాక్టరీ వన్‌ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, అమర్‌రాజా పరిశ్రమల చైర్మన్‌ గల్లా జయదేవ్‌లతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఇందులో రూ.1900 కోట్లతో ని ర్మించనున్న అమర్‌రాజా గిగా ఫ్యాక్టరీ వన్‌రూ.800 కోట్లతో అల్ట్‌మిన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, రూ.502 కోట్లతో లోహమ్‌ మెటీరియల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కం పెనీ, 25 కోట్లతో చేపట్టే సెల్‌ ఎనర్జీ కంపెనీ నిర్మా ణ పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపనలు చేశారు.


గతంలో కన్నా 6 రెట్లు అధిక నిధులు

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, కేంద్రం ప్రవేశఽపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ రైల్వేకు రూ.5337 కోట్ల నిధులు కేటాయించారని అశ్విని వైష్ణవ్‌ గుర్తుచేశారు. పదేళ్ళకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి కేవలం రూ.886 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే గతంలో కన్నా 6 రెట్లు అధిక నిధులు కేటాయించారన్నారు. అమర్‌రాజా పరిశ్రమలో మహిళా ఉద్యోగులు 400 మంది ఉండటం అభినందనీయమన్నారు. పుష్ప సినిమాలో హీరో తగ్గేదేలే (జూకేగా నహీ) అనే డైలాగ్‌ను గుర్తుచేస్తూ దివిటిపల్లి అభివృద్ధి ఆగదని (దివిటిపల్లి డెవల్‌పమెంట్‌ రుకేగా నహీ) నిరంతర అభివృద్ధి జరుగుతుందని అందరినీ నవ్వించారు.


ఆ పరిశ్రమలకు సహకరించండి..

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పారిశ్రామిక వేత్త లు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. తెలంగాణలో సెమీ కండక్టర్స్‌ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకరించాలని కోరారు. 16 గిగా వాట్‌లకు సంబంధించిన మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌తో పాటు 5 గిగావాట్‌లకు సంబంధించిన మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ కెపాసిటీతో రూ.9500 కోట్లతో పరిశ్రమను నిర్మిస్తూ 4500 మందికి నేరుగా, 10 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమన్నారు.


వేలాది మందికి ఉపాధి

అమర్‌రాజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ ఎండీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ అమర్‌రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 262 ఎకరాల విస్తీర్ణంలో పదేళ్లలో రూ.9852 కోట్ల పెట్టుబడులు పెట్టనుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా నేరుగా 4500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రెండు యూనిట్లు నిర్మాణంలో ఉండగా తాజాగా రూ.1900 కోట్లతో మూడో యూనిట్‌కు శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.800 కోట్లతో అల్ట్‌మిన్‌ పరిశ్రమ, 20 ఎకరాల్లో రూ.502 కోట్లతో లోహమ్‌ మెటీరియల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు కాబోతుందని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 03:55 AM