Share News

Manohar Lal Khattar: కేంద్రం నిధుల వినియోగంలో రాష్ట్ర సర్కారు విఫలం

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:19 AM

‘‘తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణలో ఖర్చు చేసింది.

Manohar Lal Khattar: కేంద్రం నిధుల వినియోగంలో రాష్ట్ర సర్కారు విఫలం

  • కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

‘‘తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణలో ఖర్చు చేసింది. పన్నుల రూపేణా రూ.2.3 లక్షల కోట్లు, వివిధ పథకాల కింద రూ.6.2 లక్షల కోట్లు, గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.లక్ష కోట్లు కేటాయించాం. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపం లో రూ.21,636 కోట్లను కేటాయించేలా బడ్జెట్‌ అంచనాలు రూపొందించాం. కేంద్రం కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది’’ అని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అన్నారు. కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులకు సంబంధించిన యూసీలను సమర్పించడంలో జాప్యం చేయడంవల్ల కేంద్ర నిధులు ఆగిపోతున్నాయన్నారు.


కలెక్టర్‌పై పొంగులేటి ఆగ్రహం

స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ఒక సందర్భంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గన్‌మన్‌ మోచేయి మంత్రి పొంగులేటికి తాకింది. దీంతో ఆగ్రహించిన మంత్రి శ్రీనివా్‌సరెడ్డి పక్కనే ఉన్న కలెక్టర్‌ పమేలా సత్పతిపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఏదో మాట్లాడుతుండగానే మంత్రి వాహనంలో ఎక్కి వెళ్లారు. అనంతరం మంత్రులు ఆర్‌అండ్‌బీ అథితి గృహానికి చేరుకోగా.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. తన గన్‌మన్‌ను మంత్రి పొంగులేటి వద్దకు తీసుకువెళ్లి క్షమాపణ చెప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం

Updated Date - Jan 25 , 2025 | 04:19 AM